బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ హౌస్ లో ఉన్నప్పుడే తన బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చినా తను ఎప్పటికి కావ్య ను ప్రేమిస్తున్నట్లుగా పలుమార్లు చెప్పాడు. కానీ కావ్య మాత్రం నిఖిల్ పేరు బయటపెట్టకుండా మోసం గురించి, నిజాయితీ గురించి పదే పదే పోస్ట్ లు పెట్టేది. ఇక నిఖిల్ విన్నర్ అయ్యాక కావ్య, నిఖిల్ కలిసిపోతారని అనుకున్నారు.
బిగ్ బాస్ తర్వాత వారిద్దరూ స్టార్ మా ఈవెంట్స్ లో కలిసినా ఎడ మొహం, పెడ మొహం కిందే ఉండేవారు. కావ్య నిఖిల్ ని కేర్ చెయ్యాలేదు, ఈలోపులో స్టార్ మా సీరియల్ చిన్ని లోకి నిఖిల్ ఎంటర్ అయ్యాడు. కావ్య ఆ సీరియల్ లో హీరోయిన్, నిఖిల్ పోలీస్ ఆఫీసర్ గా కావ్య ఉన్న సీరియల్ లోకి రావడంతో వారు మధ్యన ప్యాచప్ అయిందేమో, కలిసిపోయారేమో అందుకే కలిసి సీరియల్ చేస్తున్నారు అనుకున్నారు, ఆనందపడ్డారు.
కానీ మధ్యలోనే నిఖిల్ సీరియల్ నుంచి బయటికొచ్చేసాడు. కారణం చిన్ని సెట్ లో కావ్య, నిఖిల్ గొడవ పడడంతోనే నిఖిల్ ఆ సీరియల్ నుంచి బయటికొచ్చేసాడనే ప్రచారం జరి గింది. ఈ నేపథ్యంలో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరి జీవితాలు వారివేనని, తనను ఎవరితోనూ కలపొద్దని, ఎవరి పోస్టులకు తనను ట్యాగ్ చేయొద్దని తన అభిమానులను రిక్వెస్ట్ చేశాడు.
మరి నిఖిల్ అంత ఓపెన్ గానే కావ్యతో విడిపోయినట్లుగా చెప్పడం అభిమానులకు షాకిచ్చింది. కావ్య పేరు, ప్రేమ పేరు చెప్పకపోయినా ఆ పోస్ట్ మాత్రం కావ్యతో బ్రేకప్ పైనే అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.