నేను బాధలో ఉన్నపుడు, అనారోగ్యం పాలైనప్పుడు నటుడు కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తన పక్కనే ఉండి చూసుకున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నావెంట ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు, మా బంధానికి పేరు పెట్టలేను, నా ఫ్రెండ్, నా వెల్ వేషర్స్, రక్తసంబంధీకుడు, నా సోదరుడు లేదా ఫ్యామిలీ మెంబరా అనేది చెప్పలేను.. అంటూ సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
అటు అభిమానులను సంపాదించుకోవడం కూడా నా అదృష్టమే. నా లక్ తో పాటుగా నేను పడిన కష్టం ఈరోజు ఇంత అభిమానానికి కారణం. అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు కెరీర్ పై ప్రభావం చూపుతాయి అంటూ హీరోయిన్ సమంత కోలీవుడ్ లో గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్న సందర్భంలో కెరీర్, అభిమానులు, రాహుల్ రవీంద్రన్ తో అనుబంధం పై ఈ కామెంట్స్ చేసింది.
అదే ఈవెంట్ లో దర్శకురాలు సుధా కొంగర సమంత పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సమంత ను గత ఐదేళ్లుగా దగ్గరనుంచి చూస్తున్నాను, ఆమె బాధ పడుతున్నప్పుడు నాకు కన్నీళ్లు వచ్చేవి. సమంత ని చూసి ఎంతోమంది అమ్మాయిలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆమెలా ధైర్యం తెచ్చుకోవాలి, సమంత తో సినిమా చేద్దామని ఎన్నోసార్లు ట్రై చేసిను. కానీ కుదరలేదు, కానీ ఎప్పటికైనా సమంత తో సినిమా చేస్తాను అంటూ సుధా కొంగర సమంత పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.