కొందరికి వయసు ఒక నంబర్ మాత్రమే. అద్భుతమైన ఫిగర్‌తో యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది మలైకా. ఈ భామ హాఫ్ సెంచరీ ఏజ్ లో వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. తాజాగా మలైకా అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎరుపు రంగు దుస్తుల్లో మలైకా తన అందాలను తెరపరిచేసిన తీరు యూతో లో చర్చగా మారింది.
ఏజ్ లెస్ బ్యూటీ మలైకా అరోరా(50) మరోసారి చెలరేగిపోయింది! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. బోల్డ్ ఫోజులతో బాడీ కాన్ దుస్తుల్లో చెలరేగిపోతున్న మలైకా ఫోటోషూట్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఈ భామ తిరిగి ఐటమ్ పాటతో సౌత్ లో రీఎంట్రీ ఇస్తోందా? అని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఛయ్య ఛయ్యా గర్ల్ తిరిగి కంబ్యాక్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఇటీవల డ్యాన్స్ రియాలిటీ షోల న్యాయమూర్తిగా మలైకా బాగానే ఆర్జిస్తోంది. ఇప్పటికిప్పుడు పలు హిందీ చానెళ్లలో డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా మలైకా కనిపిస్తోంది. రెమో డిసౌజాతో కలిసి హిప్ హాప్ ఇండియా 2 సీజన్ కి జడ్జిగా వ్యవహరిస్తోంది.