ఇప్పటికే వివిధ ఓటీటీల నుంచి రెండు క్రేజీ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చేసాయి. థియేటర్స్ లో విడుదలై మంచి హిట్ అయిన మళయాళంలో సన్సేషనల్ హిట్ అయిన L 2 ఎంపురాన్, విక్రమ్ వీర ధీర శూర ఈ రెండు చిత్రాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చేసాయి.
మరో చిత్రం మ్యాడ్ స్క్వేర్ మరికొన్ని గంటల్లో ఓటీటీ లోకి రాబోతుంది
ఈరోజు ఏప్రిల్ 24 గురువారం ఈ రెండు క్రేజీ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చేసాయి. మళయాళమనే కాదు పాన్ ఇండియా మూవీగా విడుదలైన మోహన్ లాల్, పృథ్వీ రాజ్ సుకుమారన్ ల కాంబో చిత్రం L 2 ఎంపురాన్ మలయాళంలో అతిపెద్ద హిట్ అయ్యింది, మిగతా లాంగ్వేజెస్ లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం ఈరోజు ఏప్రిల్ 24 నుంచి జియో హాట్ స్టార్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక విక్రమ్ లేటెస్ట్ మూవీ వీర ధీర శూర చిత్రం కూడా ఈరోజు గురువారమే అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక తెలుగులో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా రేపు ఏప్రిల్ 25 నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి థియేటర్స్ లో హిట్ అయిన మ్యాడ్ స్వేర్ ని మరికొన్ని గంటల్లో నెట్ ఫ్లిక్స్ లో వీక్షించేయండి, అస్సలు మిస్ అవ్వకండి.