వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తనకున్న అతి తక్కువమంది నేతల్లో ఒకరిని సస్పెండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అసలే వైసీపీ పార్టీ నుంచి ఎందరో చేజారిపోతున్నారు. చాలామంది అధికార పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తుంటే జగన్ మాత్రం తనకున్న అతికొద్దిమందిలో కొంతమందిని చేజేతులా తప్పించడం నిజంగా జగన్ పాలిట శాపమనే చెప్పాలి
ఫైనల్లీ వైసీపీ ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేసారు. దువ్వాడ శ్రీనివాస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారని అందుకే సస్పెండ్ చెయ్యాల్సి వచ్చింది అని వైసీపీ పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎప్పుడో దువ్వాడ ను సస్పెండ్ చెయ్యాల్సిన జగన్ ఆయని ఇప్పటివరకు పార్టీలో ఉంచడమే కరెక్ట్ కాదు, ఫైనల్ గా దువ్వడను జగన్ వదిలించుకున్నారనే అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేశారు.
కానీ దువ్వాడ మాత్రం తన సస్పెన్షన్ పై స్పందిస్తూ ఇది జగన్ నా మీద కోపంతో చెయ్యలేదు, ఇది తాత్కాలికమే, సస్పెన్షన్ పూర్తవ్వగానే రెట్టించిన ఉత్సాహంతో వైసీపీలోకి వస్తాను, నాకు జగన్ దేవుడు, రాజకీయంగా తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది జగనేనని దువ్వాడ చెప్పారు. తనను ఇంతవాడిని చేసిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన దువ్వాడ తన మనసులో జగన్ ఎప్పటికీ ఉంటారని చెప్పుకొచ్చారు.