దశాబ్ధాల క్రితం ముస్లిమ్ మ్యారేజ్ వ్యవస్థలోని లోపాలను సవరించేలా చట్టపరమైన ఒత్తిళ్లకు కారణమైన షాభోనో కేసును ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. 1970లో ఈ కేసులో సుప్రీం తీర్పు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముస్లిమ్ ల వివాహ వ్యవస్థలో నియమావళిని సవరించేలా చట్టంలో మార్పులను అనుమతించేందుకు కోర్టు అంగీకరించడం నిజంగా అప్పట్లో ఒక సంచలనం.
అయితే దీనికోసం షా భానో పడిన కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోర్టులో తన వాదనలో నిజాయితీ ఉంది. తను వినిపించేదానిలో స్పష్ఠత ఉంది. ముస్లిమ్ సమాజంలోని వివాహ వ్యవస్థలో శతాబ్ధాలుగా పాతుకుపోయిన అవ్యవస్థను, మహిళా విద్వేషాన్ని, మగవారికి అనుకూల తీర్పులను న్యాయమూర్తుల ఎదుట షాభానో ప్రశ్నించారు. తన వాదనలను బలంగా వినిపించారు. తన భర్త, వక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా షాభానో చాలా ధైర్యంగా పోరాటం సాగించారు. వక్ఫ్ లో నియమావళి సహా ప్రతిదీ వివాహ వ్యవస్థ పరంగా లోప భూయిష్టమైనవని వాదించారు. చివరికి ఈ కేసులో సుప్రీం షాభానో వాదనలకు మద్ధతునిస్తూ తీర్పును వెలువరించింది.
చాలా ఏళ్ల పాటు పోరాటాల తర్వాత షాభానో విడాకుల కేసులో మెయింటెనెన్స్ దావాను న్యాయబద్ధంగా పొందేలా కేసులో విజయం సాధించారు. ఈ తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. ముస్లిమ్ వివాహ వ్యవస్థలో మహిళల హక్కులను కాలరాసే ప్రతిదానికి చెక్ పడేలా చట్టాల పరిధి విస్తరించింది. కులమతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మహిళలకు ఒకే న్యాయం అమలయ్యేలా `ఒక దేశం ఒకే చట్టం` అమలయ్యేలా సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ చిత్రంలో యామిగౌతమ్ షాభానో పాత్రలో నటిస్తుండగా, ఆమె భర్త అహ్మద్ ఖాన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు.