రంగుల ప్రపంచంలో కథానాయికలకు వేధింపుల ప్రహసనం తప్పనిసరి అని చాలా సంఘటనలు రుజువు చేసాయి. కమిట్ మెంట్ కోసం డైరెక్టుగానే అడిగేస్తారు కొందరు. ప్రాజెక్టుకు సంతకం చేసే ముందే, పారితోషికం అడ్వాన్స్ చెక్కు అందుకోక ముందే కమిట్ మెంట్ గురించి అగ్రిమెంట్లు రాయించుకుంటారు. పేరున్న స్టార్ల పిల్లలను నేరుగా కమిట్ మెంట్లు అడగకపోయినా, కొత్త ముఖాలకు ఈ తిప్పలు తప్పని పరిస్థితి ఉంటుంది.
అయితే ఇలాంటి ముప్పును ఎదుర్కొనేందుకు కొందరు యువకథానాయికలు తెలివైన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. వీళ్లు పరిశ్రమలో ప్రవేశించాక తమకు వేధింపులు ఎదురు కాకుండా ఉండేందుకు తమ వెంటే పబ్లిగ్గా ఒక బోయ్ ఫ్రెండ్ ని తిప్పుకుంటున్నారు. నాలుగైదేళ్ల క్రితం ఒక బోల్డ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హాట్ హీరోయిన్ నాలుగైదు సినిమాల్లో నటించాక తన బోయ్ ఫ్రెండ్ ని పబ్లిగ్గానే ఇండస్ట్రీలో తన వెంటే రక్షణగా తిప్పుకోవడం చర్చనీయాంశమైంది. అతడితో వరుస ఫోటోషూట్లలో పాల్గొని వాటిని షేర్ చేయడం ద్వారా ఎదుటివారికి హెచ్చరికలు పంపింది.
ఇటీవల అగ్ర హీరోల సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి కుమార్తె తన బోయ్ ఫ్రెండ్ ని ఇప్పటికే ఇండస్ట్రీ ప్రజలకు పరిచయం చేయడం ద్వారా తెలివైన ఎత్తుగడను అనురించింది. బోయ్ ఫ్రెండ్ తో తిరుపతి విజిట్లకు జాతీయ స్థాయిలో ప్రచారం దక్కడంతో, తనకంటూ ఒక తోడు నీడ ఉన్నాడని సూటిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు అదే బాటలో ఈ బ్యూటీ సోదరి కూడా తన బోయ్ ఫ్రెండ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అందరికీ షాకిస్తోంది. ఇప్పుడిప్పేడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న ఈ భామ నేరుగా డేటింగ్ లో ఉన్నానని చెప్పకుండానే, ప్రియుడిపై ప్రేమను ప్రకటిస్తూ, తాజాగా ఒక నెక్లెస్ పెండెంట్ ని ప్రదర్శించింది. ఇందులో తన పేరులోని మొదటి అక్షరం, ప్రియుడి పేరులోని మొదటి అక్షరం డిజైన్ చేసి ఉన్నాయి. మధ్యలో లవ్ సింబల్ కూడా ఉంది. ఈ వ్యవహారం చూశాక.. ఇండస్ట్రీ జనాలను గట్టిగా దేనితో కొట్టాలో ఈ సిస్టర్స్ కి తెలిసినట్టుగా ఇతరులకు తెలియలేదని గుసగుస మొదలైంది.