అజిత్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన గాడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తెలుగులో నామమాత్రపు కలెక్షన్స్ నమోదు చెయ్యగా.. తమిళనాట మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అజిత్ స్టామినాతో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం 200 కోట్లు పైనే కలెక్షన్స్ రాబట్టడంలో అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్ర ఓటీటీ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ కన్నేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది.
అయితే ఇప్పడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి మే రెండో వారంలో స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి థియేటర్స్ లో మిస్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ని ఓటీటీ వేదికగా చూసేందుకు ఆడియన్స్ రెడీ అవుతున్నారు.