రాజా సాబ్ ఊసు లేకపోయినా, మేకర్స్ ప్రభాస్ రాజా సాబ్ పై నోరు మెదకపోయినా.. ఏదో ఒక రకంగా రాజా సాబ్ వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా రాజా సాబ్ సడన్ గా సోషల్ మీడియా అందులోనూ X లో ట్రెండ్ అవడం చూసి అందరూ షాకవుతున్నారు. ఈ నెలలో అంటే ఏప్రిల్ లో రాజా సాబ్ విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో రాజా సాబ్ విడుదల పోస్ట్ పోన్ అయ్యింది.
రాజా సాబ్ టీజర్ పై క్రేజీ న్యూస్ వినబడుతుంది. దర్శకుడు మారుతి రాజా సాబ్ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నారట, తాజాగా మారుతి HIGH ALERT… HEAT WAVES gonna rise even higher from mid-May! అంటూ వేసిన ట్వీట్ తో మే మిడిల్ లో టీజర్ ఖచ్చితంగా వస్తోంది అని ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. ఇక తమన్ రీ రికార్డింగ్ మొదలుపెట్టేయ్యడమే కాదు ఆ టీజర్ అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది అంటున్నారు.
ప్రభాస్ లుక్స్ కానీ, టీజర్ కంటెంట్ కానీ, థమన్ మ్యూజిక్ కానీ, విజువల్స్ అన్ని రాజా సాబ్ టీజర్ లో హైలెట్ అవడమే కాదు, ఫ్యాన్స్ కు నచ్చి, మెచ్చేలా టీజర్ ఉంటుంది అని తెలుస్తోంది. మరి రాజా సాబ్ టీజర్ పై ఇలాంటి వార్తలు అభిమానులకు పూనకాలు కాక ఇంకేమోస్తాయి. ఆ టీజర్ డేట్ ఏదో ఇచ్చేస్తే ఫ్యాన్స్ కూడా కూల్ అవుతారు.