దువ్వాడ శ్రీనివాస్ ను కాదు ముందు సజ్జల రామకృష్ణ ను వైసీపీ పార్టీ సస్పెన్స్ చేస్తే తప్ప వైసీపీ పార్టీ బాగుపడదు. ఇది వైసీపీ కార్యకర్తల ఇన్నర్ ఫీలింగ్. కాదు కాదు సోషల్ మీడియాలో బహిరంగంగానే వినబడుతున్న కామెంట్. వైసీపీ పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు అంతా సజ్జలపై పీకలవరకు కోపం పెంచుకుని ఉన్నారు.
నిన్న జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దివ్వెల మాధురి తో కలిసి దువ్వాడ చేసిన అరాచకాలు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు విషయంలో దువ్వాడ పై యాక్షన్ తీసుకున్నారు కానీ, మీ పార్టీని సర్వనాశనం చేస్తున్న సజ్జలపై ముందు యాక్షన్ తీసుకోండి అంటున్నారు.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేశాడు అంట…..
సజ్జల ని సస్పెండ్ చేస్తే తప్ప పార్టీ బాగు పడదు @ysjagan, సజ్జలతో పోల్చుకుంటే దువ్వాడ 100 రేట్లు బెటర్ అంటూ సోషల్ మీడియాలో జగన్ ను ట్యాగ్ చేస్తూ వేస్తున్న ట్వీట్లు నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నాయి.