ఇప్పటికి దర్శకుడు హరీష్ శంకర్ తప్పు ఒప్పుకోవడం లేదు. వెటకారం తగ్గించుకోవడం లేదు, తాను అదిరిపోయే సినిమా ఇచ్చినా ప్రేక్షకులు చూడడం లేదు అంటూ ఆడియన్స్ పై నెపం నెట్టేస్తున్నారు ఆయన. పర భాషా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు ఒరిజినల్ తెలుగు చిత్రాలను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆయన జింఖానా ఈవెంట్ లో గతంలో ప్రేక్షకులు వేరే భాషల చిత్రాలు చూస్తున్నారు, మా కంటెంట్ నచ్చడం లేదు అని ఎందుకు అన్నానంటే నా చిత్రం మిస్టర్ బచ్చన్ ఎవరూ చూడలేదు, అదే తమిళ్ నుంచి వచ్చిన తంగలాన్ చూశారు అంటూ నెపం ఆడియన్స్ మీదకి నెట్టేస్తున్నారు హరీష్ శంకర్. అంతేకాని తాను మిస్టర్ బచ్చన్ తో అవుట్ డేటెడ్ కంటెంట్ ఇచ్చాను, ఆడియన్స్ కి నచ్చలేదు అని ఒప్పుకోవడం లేదు ఆయనగారు.
పరభాషా చిత్రాలపై మోజు చూపిస్తున్నారు. పరభాషా చిత్రాల కోసం ఎగేసుకుంటూ వెళ్ళినట్టే ఈ జింఖానా చిత్రాన్ని కూడా చూడండి, ఎవరెలా అనుకున్న నాకు ఇబ్బంది లేదు, అందరూ ఈ చిత్రాన్ని తప్పక చూడండి అంటూ మలయాళ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న హరీష్ శంకర్ తెలుగు ఆడియన్స్ పై వెటకారపు కామెంట్స్ చేసారు.
మరి నెటిజెన్స్ ఊరుకుంటారా.. మీరు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చెయ్యండి, అప్పుడు థియేటర్స్ కి జనాలు ఆటోమాటిక్ గా వస్తారు, మీరు చీప్ కంటెంట్ సినిమాలు చేసి పరభాషా చిత్రపై ప్రేక్షకుల మోజు చూపిస్తున్నారు అని వెటకారం గా మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వే ఇతర భాషల చిత్రాలను రీమేక్ చేసుకుంటావు, నువ్వా ఇలాంటి కామెంట్స్ చేసేది హరీష్ శంకరు అంటూ నెటిజెన్స్ హరీష్ శంకర్ కి కౌంటర్ ఇస్తున్నారు.