హరి హర వీరమల్లులో మిగిలిన షూటింగ్ పూర్తి చెయ్యడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు, మే నుంచి పవన్ వీరమల్లు షూటింగ్ లోకి రాబోతున్నారు. మే 8 కి హరి హర వీరమల్లు రావడం అసాధ్యం, ఇప్పుడు పవన్ వచ్చి మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తే అప్పుడు మే నెల చివరిలో హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించొచ్చు అని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ ఈసారైనా మాట పై నిలబడతారా, ఏకధాటిగా వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేస్తారా అనే సందేహాల్లో చాలామంది కనబడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ లో విరామం లేకుండా పాల్గొంటే ఎంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తే వీరమల్లు కు మోక్షం కలుగుతుంది. అసలే హరి హర వీరమళ్లు పార్ట్ 1, పార్ట్ 2 కింద విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
ఒక్కసారి పవన్ కళ్యాణ్ సెట్ లోకి వస్తే స్పీడుగా షూటింగ్ పూర్తి చేసేసి రిలాక్స్ అవ్వాలని దర్శకులు చూస్తున్నారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకున్నారు. చూద్దాం వీరమల్లు పరిస్థితి ఏమిటి అనేది.