ఆర్.ఆర్.ఆర్ లో యుంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు రాజమౌళి పులితో ఫైట్ చేయించారు. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ కి మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి, ఆ సీన్ గురించి అందులోని ఎన్టీఆర్ నటనకు గురించి ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటి రాజమౌళి తన తదుపరి హీరో మహేష్ తో అంతకుమించి ఫైట్ చేయిస్తారుగా.
అదే జరుగబోతుంది. SSMB 29 లో మహేష్ తో రాజమౌళి ఓ నెక్స్ట్ లెవల్ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారట. అడవి నేపథ్యంలో ఓ పవర్ ఫుల్ ఎపిసోడ్ SSMB 29 కోసం రాజమౌళి డిజైన్ చేశారట. ఆ ఎపిసోడ్ మొత్తం ఓ డైనోసార్ చుట్టూ తిరుగుతుంది అని, హీరో వెంట డైనోసార్స్ పడడం, మహేష్ దానిని ఛేజ్ చేయడం, మొత్తంగా హీరో తనని తాను కాపాడుకోవడం ఇలా ఆ ఎపిసోడ్ ని నెక్స్ట్ లెవల్ అనేలా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోనే మూడో షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. మహేష్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ల నడుమ కీలకసన్నివేశాల చిత్రీకరణలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అడివి నేపధ్యమున్న ఎపిసోడ్ కోసం రాజమౌళి ఆఫ్రికా అడవులకు వెళతారని తెలుస్తుంది.