వైసీపీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్యెల్యే అంబటి రాంబాబు పోలీసులకు మాత్రమే కాదు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇవ్వడం అటుంచి బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు మీకు 75 ఏళ్ళు వచ్చాయి, ఇకపై కాస్త తగ్గి ఉండండి, మేము అధికారంలోకి వచ్చాక మేమేమిటో చూపిస్తాం అంటూ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్నే బెదిరిస్తున్నారు.
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి నీతిమంతుడు, అతని అరెస్ట్ అక్రమం అంటూ రాజ్ కసిరెడ్డి అరెస్ట్ పై మాట్లాడమే కాదు, తమ నేతలు ఏ తప్పు చెయ్యకపోయినా అరెస్ట్ లు చేస్తున్నారు, ఎంతకాలం అరెస్ట్ లు చేస్తారు, అరెస్ట్ చేస్తే జైలుకెళతాం, బెయిల్ రాదా, రాకపోతే ఓ ఏడాది జైల్లో ఉంటాం, తర్వాత మేమేమిటో చూపిస్తామంటూ ఊగిపోతున్నారు సదరు మాజీ గారు.
మరి వైసీపీ నేతల వరస అరెస్ట్ లతో అంబటి లాంటి వాళ్లకు నిద్ర కరువైంది, నెక్స్ట్ జైలుకెళతామేమో అనే భయంతోనే అంబటి ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తప్పు చేసిన ఎవ్వరిని కూటమి ప్రభుతం వదలంటూ టీడీపీ అభిమానులు కౌంటర్ వేస్తున్నారు.