స్నేహానికి వయసు అంతరంతో పని లేదు. ఇద్దరి మధ్య సింక్ చాలా ముఖ్యం. అలాంటి సింక్ కుదిరింది 77 ఏళ్ల ఎలన్ మస్క్ తల్లి మాయే మస్క్ తో 39 ఏళ్ల జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి. సంఘంలో హైప్రొఫైల్స్ తో స్నేహం చేసే బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ అందాల పోటీల రాణిగా ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఎలన్ మస్క్ మాతృమూర్తి మాయో మస్క తో కలిసి ముంబై సిద్ధి వినాయక ఆలయంలో ఈస్టర్ ఆదివారం నాడు పూజలాచరించారు. మాయో 77వ పుట్టినరోజు సందర్భంగా జాకీతో పాటు ఆలయాన్ని సందర్శించారు మాయో మస్క్.
అయితే మాయో మస్క్ తన పుస్తకావిష్కరణ కోసం కొద్దిరోజులుగా ఇండియాలో ఉన్నారని జాక్విలిన్ వెల్లడించింది. మాతృత్వం, వ్యవస్థాపక రంగంపై మాయో రాసిన పుస్తకం తనను చాలా మార్చిందని జాకీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మా మధ్య వయసు అంతరం ఉన్నా స్నేహానికి ఇది అడ్డు కాదని కూడా తెలిపింది.
మాయే మస్క్ పుస్తకం `ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్` హిందీ ఎడిషన్ ని ఇటీవల భారతదేశ మార్కెట్లో విడుదల చేసారు. 200 కోట్ల స్కామ్‌తో సంబంధం ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తో జాక్విలిన్ సన్నిహితంగా వ్యవహరించడంతో ఈ కేసులో నిందితురాలిగా విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వివాదాలతో సంబంధం లేకుండా సామాజిక సేవనం, ఆధ్యాత్మిక ప్రయాణానికి జాకీ ప్రాధాన్యతనిస్తోంది.