Advertisement
Google Ads BL

ఐటీ సంస్థలపై అక్కసు చూపిస్తున్న వైసీపీ


జగన్ మోహన్ రెడ్డి గత పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చెయ్యడమే కాదు, తన చుట్టూ ఉన్నవారు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నా కళ్లప్పగించి చూసారు తప్ప వారిని ఏ కోశానా శిక్షించడానికి ట్రై చెయ్యలేదు. తనకే పరిపాలన పై అవగాహన లేదు, కేవలం స్విచ్ ఆన్ చేసే ముఖ్యమంత్రిగా పేరు గాంచిన జగన్ మోహన్ రెడ్డి ఐటి పరిశ్రమను కానీ, మరే ఇతర రంగాల అభివృద్ధికి ఇంట్రెస్ట్ చూపించలేదు. 

Advertisement
CJ Advs

పరిశ్రమలను రాష్టంలోకి రాకుండా తరిమి కొట్టింది వైసీపీ ప్రభుత్వం, రాష్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా చేసింది. అవినీతి రుచి మరిగిన వైసీపీ పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేసింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం విజయకేతునం ఎగురేసినప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క పరిశ్రమలనే కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం, మెరుగుపరిచే విధానాలతో పాలనా కొనసాగిస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ సంస్థలను తిరిగి రాష్ట్రానికి రప్పించేలా ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తోంది. 

అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ పారిశ్రామలను స్థాపిస్తున్న వ్యాపారవేత్తలకు త్వరితగతిన భూ కేటాయింపులు చేస్తోంది. అది చూసి వైసీపీ నేతల కడుపు మండిపోతోంది. తాము జీవిత కాలం శ్రమించినా తీసుకురాలేని సంస్థలను 11 నెలలోపే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం చూసి తట్టుకోలేక రగిలిపోతున్నారు. గతంలో అంటే వైసీపీ పాలనలో జిల్లాకో వైసీపీ పార్టీ ప్యాలెస్ కట్టిన జగన్ ఇప్పుడు ఐటి కంపెనీలకు స్థలాలు కేటాయిస్తుంటే నచ్చడం లేదు. అందుకే విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 

ఐటీ నగరంగా విశాఖను అభివృద్ధి చేయడంలో బాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో పాటు కాపులఉప్పాడలో డేటా సెంటర్ కోసం ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెం.3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి రూ. 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 సంవత్సరాల గడువు కూడా ఇచ్చింది.

అది చూసిన వైసీపీ నేతలు కడుపు మంటతో కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే ఓర్పుకోలేక నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో వైసీపీ పార్టీ నేతలు అంతకంతకు దిగజారిపోతున్నారు

IT in Vizag:

IT companies in Vizag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs