ఎన్టీఆర్ ఫ్యూడినే కాదు బెస్ట్ కుక్ అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో లో మటన్ బిర్యానీ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఎన్టీఆర్ వండిన ఫుడ్ తిన్నవారెవరైనా ఎన్టీఆర్ ఫుడ్ గురించి కుకింగ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంట గురించి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో మట్లాడారు.
ఎన్టీఆర్ మటన్ కర్రీ, నాటు కోడి కర్రీ చాలా బాగా చేస్తాడని కళ్యాణ్ రామ్ చెప్పారు. ఇక తాజాగా ఎన్టీఆర్ తన వంట రుచిని హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి కూడా చూపించినట్టుగా ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ వరల్డ్ లోనే బెస్ట్ కుక్ అంటూ హృతిక్ రోషన్ ఓ ఈవెంట్ లో మట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. హృతిక్ రోషన్ అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ని తెగ పొగుడుతున్నారు.
వార్ 2 తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హృతిక్ రోషన్-ఎన్టీఆర్ బాండింగ్ ని ఎవ్వర్నీ మరిచిపోకుండా చేస్తున్నారు హృతిక్. ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను, ఎన్టీఆర్ కమిట్మెంట్ ఉన్న నటుడు, ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడం నిజంగా సూపర్ అంటూ హృతిక్ పలు సందర్భాల్లో చెప్పగా.. ఇప్పుడు ఓ భారీ ఈవెంట్ లో ఎన్టీఆర్ సూపర్ గా వంట చేస్తాడు, ఆయన వరల్డ్ లోనే బెస్ట్ కుక్ అంటూ ప్రశంసించిన వీడియో వైరల్ అవుతుంది.