రాబిన్ హుడ్ రిజల్ట్ తో బాగా డీలా పడిపోయిన నితిన్ మే 9 కల్లా తమ్ముడు చిత్రంతో వచ్చేస్తాడు, ముందు చెప్పిన డేట్ కే తమ్ముడు చిత్రాన్ని దించేస్తాడు, రాబిన్ హుడ్ కి తమ్ముడు చిత్రానికి ఎంతో గ్యాప్ లేదు, సమ్మర్ హాలిడేస్ అయినప్పటికీ డిజాస్టర్స్ లో ఉన్న నితిన్ కి తమ్ముడు రిలీజ్ హెల్ప్ అవుతుందా ఇలా నితిన్ అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్-రాశి ఖన్నా జంటగా తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రంపై ట్రేడ్ లో ఎంత బజ్ ఉంది, అసలు ప్రేక్షకుల్లో ఏ మాత్రం అంచనాలు ఉన్నాయో చెప్పడం కష్టమే. ఇకపోతే ఇప్పుడు నితిన్ సమ్మర్ హాలిడేస్ ని వదిలేసుకున్నాడు. తమ్ముడు చిత్రాన్ని జులై 4కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరి రాబిన్ హుడ్ ని పరీక్షల సమయంలో విడుదల చేసి చేతులు కాల్చుకున్ననితిన్ ఇప్పుడు తమ్ముడు చిత్రాన్ని లాభాలు తెచ్చే వేసవి సెలవలను వదిలేసుకుని జులై లో స్కూల్స్ ఓపెన్ అయిన సమయంలో విడుదల చెయ్యడం ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది పెద్ద క్వచ్చన్ మార్క్ లా కనిపిస్తుంది. చూద్దాం నితిన్ ఐడియా ఏమిటి అనేది.