నందమూరి బాలకృష్ణ కొన్నేళ్లుగా సక్సెస్ బాట పట్టారు. వరస విజయాలతో బాలయ్య నిర్మాతలకు కూడా బోలెడన్ని లాభాలు రావడంతో బాలయ్య పై క్రేజ్ మరింత పెరిగింది. అఖండ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డాకు మహారాజ్ వరకు సక్సెస్ ఫుల్ గా బాలయ్య కెరీర్ సాగడమే కాదు, అటు అన్ స్టాపబుల్ టాక్ షో కూడా బాలయ్య క్రేజ్ మరింత పెంచేసింది.
ఇప్పుడు బాలకృష్ణ తన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి తో అఖండ 2 చేస్తున్నారు. ఈ చిత్రం పై విపరీతమైన అంచనాలున్నాయి. ఇక డాకు మహారాజ్ తో నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య అఖండ 2 పై ప్రముఖ ఓటీటీ సంస్థలు ఫోకస్ చెయ్యడమే కాదు, అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి.
ఒకటి నెట్ ఫ్లిక్స్, రెండోది అమెజాన్ ప్రైమ్. ఈ రెండు ఓటీటీ సంస్థలు అఖండ డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు పోటాపోటీగా కోట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి విడుదలకు ముందే అఖండ 2 పై ఓటీటీ సంస్థలు ఇలా పోటీపడుతున్నాయంటే.. ఆ చిత్రం పై క్రేజ్ ఎలా ఉందొ అర్ధమవుతుంది. ఈ లెక్కన అఖండ 2 డిజిటల్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంటుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.