మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో జనవరిలో మొదలైన SSMB 29 చిత్రం తాజాగా మూడో షెడ్యుల్ ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్, ఒడిశాలో రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసిన రాజమౌళి తాజాగా మూడో షెడ్యూల్ స్టార్ట్ చేసేసారు. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలు నటిస్తున్న విషయం తెలిసిందే.
రాజమౌళి SSMB 29పై ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే ఆయన సైలెంట్ గా చిత్రీకరణ చేసుకుంటున్నారు. SSMB 29 లో ఓ ఫైట్ హైలెట్ గా నిలవబోతుంది అంటున్నారు. అది సముద్రంలో బోట్స్ ఫైట్ SSMB 29 కి కీలకం కాబోతుంది. ఈ సీక్వెన్స్ లో మహేష్, పృథ్వీ రాజ్, ప్రియాంక చోప్రా ఇంకా కొంతమంది కీలక నటులు పాల్గొంటారని తెలుస్తుంది.
అంతేకాకుండా మూడు వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా కనిపించే ఈ భారీ సీక్వెన్స్ కోసం ఓ పెద్ద సెటప్ చేస్తున్నారట. మే లో మొదలు పెట్టి జూన్ వరకు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రాజమౌళి చిత్రీకరిస్తారని తెలుస్తోంది.