అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది. కానీ ప్రొఫెషనల్ గా మాత్రం ఆమె చాలా గ్లామర్ గా తయారవవుతుంది. గ్లామర్ అంటే అలాంటి ఇలాంటి గ్లామర్ కాదు, టూ గ్లామర్ షో చేస్తుంది. నాగ చైతన్య ని పెళ్లాడిన తర్వాత శోభిత దూళిపాళ్ల అటు ఫ్యామిలీ, ఇటు కెరీర్ ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది.
తాజాగా శోభిత దూళిపాళ్ల గోల్డెన్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో కనిపించింది. అణువణువునా బంగారు మిరుమిట్లు కళ్లు జిగేల్మనిపిస్తున్నాయి. ఆ డ్రెస్ లో శోభిత దూళిపాళ్ల అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ తో అదరగొట్టేసింది. శోభిత ఆ ఫోటొస్ ని షేర్ చేస్తూ.. గోల్డెన్ అవర్, కానీ దానిని కోచర్‌గా చేసుకోండి అంటూ క్యాప్షన్ పెట్టింది.
శోభిత రీసెంట్ గా బాలీవుడ్ ఫ్యాషన్ షో లో రాహుల్ మిశ్రా డిజైనర్ వేర్ లో ఇలా మోడ్రెన్ డ్రెస్సులో గ్లామర్ గా మారింది. ప్రస్తుతం శోభిత గ్లామర్ లుక్ వైరల్ గామారింది.