Advertisement
Google Ads BL

CBN కి పవన్ బర్త్ డే విషెస్


ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుబంధాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవేమో అన్న రీతిలో వారి మద్యన స్నేహం కనిపిస్తుంది. చంద్రబాబు జైలు లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించడమేకాదు, కూటమిని అధికారంలోకి తెచ్చేవరకు చంద్రబాబు తో కలిసి పోరాడారు. అంతేకాదు చంద్రబాబు రాజకీయ జీవితం చూసాక తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, అంతటి అనుభవజ్ఞుడు గనుకనే చెల్లాచెదురైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు అంటూ పవన్ పదే పదే చంద్రబాబు నాయుడుని పొగిడేస్తున్నారు. 

Advertisement
CJ Advs

నేడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు, బాబు బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేసారు. అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు*

* వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు

ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని  పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం.

వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. అంటూ పవన్ కళ్యాణ్ స్నేహపూర్వకంగా చంద్రబాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. 

Pawan birthday wishes to CBN:

Pawan Kalyan birthday wishes to Chandrababu naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs