స్టార్ హీరోయిన్ కోట్లాదిమంది అభిమానుల కలల రాణి. డ్రీమ్ గర్ల్ గా ప్రజల హృదయాలను గెలుచుకుంది. తనదైన నటన, అద్భుత అభినయంతో దశాబ్ధాలుగా పరిశ్రమను ఏల్తోంది. నేటితరం నాయికలతో పోటీ ఎంత ఉన్నా, తన స్థాయిని నిలబెట్టుకుంటూ ఇప్పటికీ అగ్ర నాయిక హోదాను కొనసాగిస్తోంది. ఇటీవల `క్రూ` సినిమాలో కుర్రభామలతో పోటీపడుతూ గ్లామ్ క్వీన్ గా మనసులు దోచింది. గ్లామర్ ఎలివేషన్ కి వయసుతో పని లేదని నిరూపించింది.
ఒక్కో సినిమాకి పది కోట్లు డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు మమ్మీగా కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. అయితే తన ఆన్ స్క్రీన్ ఇమేజ్ కి భిన్నంగా ఇప్పుడు బెబో కరీనా పోస్ట్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో కరీనా తన వాస్తవ రూపాన్ని యథాతథంగా ప్రదర్శించి షాకిచ్చింది.
ముఖంపై చిన్న చిన్న మచ్చలు ఉన్నా, దానిని ఎడిట్ చేసేందుకు ఉన్న ఆప్షన్ ని కూడా ఉపయోగించుకోలేదు. తన సహజ సౌందర్యాన్ని ప్రదర్శించేందుకు మొగ్గు చూపింది. బ్లాక్ కలర్ బికినీలో కరీనా ఫోజ్ ఇప్పుడు యువతరంలో చర్చగా మారింది. బెబో తదుపరి ప్రఖ్యాత దర్శకురాలు రాజీ ఫేం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో నటించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ఒక కీలక పాత్రను పోషించనున్నారు.