నటుడు షైన్ టామ్ చాకో ఈ రోజు ఉదయం కేరళ ఎర్నాకులం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 4 గంటల పాటు విచారించారు. దాదాపు 32 ప్రశ్నలు అడగ్గా, అందులో ఎక్కువగా అతడు హోటల్ గది నుంచి ఎందుకు పారిపోయాడు? అనే దానిపైనే పోలీసులు రిపీటెడ్ గా ప్రశ్నించారని సమచారం.
దానికి అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. తన ఇంటి ముందు ఉన్నది పోలీసులు కాదు దుండగులు అనుకోవడంతో తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని భావించినట్టు టామ్ చెప్పాడు. అదే సమయంలో హోటల్ గది నుంచి పారిపోవడానికి కూడా దుండగులు తనపై ఎటాక్ చేస్తున్నారని భావించి పారిపోయానని చెప్పినట్టు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.
టామ్ పై నార్కోటిక్స్ చట్టంలోని అన్ని కేసులను భనాయించారు. అయితే అతడికి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ మంజూరు అయింది. ఇది బెయిల్ పొందలేనంత కఠినమైన కేసు కాదని తెలుస్తోంది. అతడు తన నేరాన్ని అంగీకరించాడు. రేవ్ పార్టీల్లో డ్రగ్స్ పుచ్చుకున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతడికి బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. టామ్ చాకో డ్రగ్స్ సేవించాడని నటి ఆరోపించాక అతడిపై నార్కోటిక్స్ అధికారులు వేట ప్రారంభించారు. వారితో కొచ్చి పోలీసులు కూడా వెంటపడ్డారు. మూడు రోజులుగా ఎవరికీ చిక్కని టామ్ ఈ శనివారం ఉదయం ఎర్నాకులం పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు. డ్రగ్స్ కేసులో నటుడు పొద్దున్న అరెస్టయితే సాయంత్రానికి బెయిల్‌తో బయటకు వచ్చాడు.