చాలామంది సినీప్రముఖులు తమ సినిమాలు విడులయ్యాక అందులో కంటెంట్ తో సంబంధం లేకుండా, ప్రేక్షకుల రియాక్షన్ తో పని లేకుండా, తమ సినిమా హిట్ అయినా.. కేవలం రివ్యూ రైటర్స్ ఇచ్చిన రేటింగ్స్ వలనే సినిమాకు కలెక్షన్స్ రావట్లేదు అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటారు. నాగ వంశి లాంటి నిర్మాత.. సినీ విమర్శకులు తమ సినిమాలను చూడొద్దు, రివ్యూలు రాయొద్దు అంటారు.
తాజాగా సీనియర్ నటి విజయశాంతి కూడా అదే కోవలో మట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె రీ ఎంట్రీ లో సరిలేరు నీకెవ్వరూ తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చేసారు. విజయశాంతి కళ్యాణ్ రామ్ తో ఈక్వల్ గా నటించిన ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
అయితే ఈరోజు శనివారం పార్క్ హయత్ లో జరిగిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్లో విజయశాంతి మట్లాడుతూ.. ఏ హీరో సినిమా అయినా.. ఎవరి సినిమా అయినా కావాలని కొందరు నెగిటివ్ చేస్తున్నారు.. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కొంతమంది కావాలనే నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమాను చంపుతున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు.. వారిని క్షమించకూడదు అంటూ విజయశాంతి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.