వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి బయటికొచ్చి సౌత్ లో సెటిల్ అవుతానని చెప్పిన అనురాగ్ కశ్యప్ తాను షారుఖ్ ఖాన్ కన్నా బిజీగా వున్నాను అంటూ మాట్లాడారు. అంతేకాదు అనురాగ్ కశ్యప్ తన సినిమా పూలే చిత్ర రిలీజ్ సందర్భంగా బ్రాహ్మణ సామజిక వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.
ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అనురాగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. అనురాగ్ కశ్యప్ ని చంపేయ్యాలంటూ, అతన్ని అరెస్ట్ చెయ్యాలంటూ నినాదాలు మొదలయ్యాయి. దానితో దారికొచ్చిన అనురాగ్ కశ్యప్ తన మాటలు ఎవరినైతే బాధించాయో వారికి క్షమాపణలు చెబుతున్నాను, నా ఫ్యామిలీ ని చంపేస్తామని బెదిరిస్తున్నారు.
నా కూతుర్ని ఈ వివాదంలోకి లాగి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు.. నాకు నా కూతురు కన్నా ఏది ఎక్కువ కాదు, నన్ను ఏమైనా చేసుకోండి, కాని ఈవివాదంలోకి నా ఫ్యామిలిని లాగొద్దు. మీరు నా నుంచి క్షమాపణలు కోరారు. అందుకే నేను బహిరంగంగా మీ అందరికి సారీ చెబుతున్నాను అంటూ అనురాగ్ కశ్యప్ ఓ ప్రెస్ నోట్ విడుదలచేశారు.