యంగ్ హీరో నితిన్ - శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన రాబిన్ హుడ్ చిత్రం విడుదలకు ముందు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో కనిపించడం, అలాగే రాబిన్ హుడ్ ప్రమోషన్స్ అన్ని సినిమాపై హైప్ ని క్రియేట్ చేసాయి. అయితే సినిమా విడుదలయ్యాక ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
మార్చ్ 28 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. అయితే సినిమా థియేటర్స్ లో ప్లాప్ అవడంతో ఈచిత్రం నెల తిరిగే లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసారు అందరూ.. కానీ ZEE5 తాజాగా రాబిన్ హుడ్ ఓటీటీ డేట్ ని అధికారికంగా ప్రకటించింది.
అది మే 2 నుంచి నితిన్ రాబిన్ హుడ్ చిత్రాన్ని జీ 5 నుంచి స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా ప్రకటించారు. సో థియేటర్స్ లో మార్చ్ లో విడుదలైన ఈచిత్రం మే 2 నుంచి ఓటీటీ వేదికపైకి రాబోతుంది.