రాజ్ తరుణ్ కు సారీ చెప్పి లావణ్య సైలెంట్ గా ఉంటున్న సమయంలో మరోసారి రాజ్ తరుణ్-లావణ్య ల మధ్యన రచ్చ మొదలయ్యింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకాపేటలోని రాజా తరుణ్-లావణ్య విల్లా దగ్గరకు రావడం, అక్కడ వాళ్ళను లావణ్య బయటికి పంపించడమే కాదు రాజ్ పేరెంట్స్ తనని కొట్టారంటూ మీడియా కెక్కడం అన్ని మళ్లీ స్టార్ట్ అయ్యింది.
తనని శేఖర్ బాషా ఆడదాని వేషంలో వచ్చి కొట్టాడని, అతనికి ఫ్యామిలీ ఉంది, సర్వనాశనం అవుతాడు, తనకి ఓ కూతురు ఉంది ఆమెకి ఇలానే అయితే ఏం చేస్తడు అంటూ శేఖర్ బాషా పై లావణ్య ఫైర్ అవడమే కాదు, రాజ్ తరుణ్ ని వదిలెయ్యమని అరియనా తనకి 50 లక్షలు ఆఫర్ చేసింది అంటూ లావణ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
రాజ్ తరుణ్ తన ఇంట్లోకి కుక్క పిల్లలను తెచ్చుకున్నట్టే అరియానను తెచ్చుకుంటాను అన్నాడు, అరియానా కూడా నాకు చెప్పింది. రాజ్ తో అరియానకు ఎఫ్ఫైర్ ఉంది నాకు తెలుసు. అరియనా నాతొ స్వయంగా మాట్లాడింది.. ఆ విషయం రాజ్ తరుణ్ ముందే తేల్చుకుందాం అంటూ రాజ్ తరుణ్ పై లావణ్య ఫైర్ అయ్యింది.
ఇక రాజ్ తరుణ్ పేరెంట్స్ కళ్ళ నీళ్లు పెట్టుకోవడంతో వాళ్ళను ఇంట్లోకి రానిచ్చాను. రాజ్ తరుణ్ ని మాత్రం వదలను, అతనికి శిక్ష పడేలా చేస్తాను. నన్ను రాజ్ తరుణ్ మోసం చేసాడు. నన్ను బజారున పడేసాడు అంటూ లావణ్య రాజ్ తరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.