మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, ఓటీటీలలో మల్టిపుల్ లాంగ్వేజెస్ లోను సూపర్ హిట్ అయిన మోహన్ లాల్-పృథ్వీ రాజ్ సుకుమారన్ ల లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ గా పృథ్వీ రాజ్ సుకుమార్ తెరకెక్కించిన L 2 ఎంపురాన్ చిత్రం గత నెలలో విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాదు కాదు అక్కడ ఇండస్ట్రీ హిట్ గా L 2 ఎంపురాన్ నిలిచింది.
పాన్ ఇండియా ఫిలిం గా పలు భాషల్లో విడుదలైన L 2 ఎంపురాన్ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు లేదు. L 2 ఎంపురాన్ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారడంతో.. ఈ చిత్రంపై మలయాళంలో మరింత క్రేజ్ పెరిగింది. మలయాళ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన L 2 ఎంపురాన్ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
L 2 ఎంపురాన్ డిజిటల్ హక్కులను జియో ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో కొనుగోలు చెయ్యగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలై నెల తిరగకముందే ఓటీటీ లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఏప్రిల్ 24 నుంచి జియో ప్లస్ హాట్ స్టార్ వేదికగా L 2 ఎంపురాన్ స్ట్రీమింగ్ లోకి రానుంది అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చిపడింది.