ఎప్పుడు చిట్టి పొట్టి డ్రెస్సులతో గ్లామర్ చూపిస్తూ సినిమా ప్రమోషన్స్ లో కనిపించే బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు రెట్రో మూవీ ప్రమోషన్స్ లో మాత్రం వింటేజ్ పూజ హెగ్డే అంటే మొత్తం స్టయిల్ మార్చేసి కనిపించడం ఆమె అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఆమె రీసెంట్ ఇంటర్వూస్ లో చక్కటి చీరకట్టులో కనువిందు చేసింది.
రెట్రో ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియా కి ఇంటర్వ్యూలు ఇస్తోన్న పూజ హెగ్డే ట్రాన్స్పరెంట్ శారీ లో దేవతలా దర్శనమిచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో 30 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే వారంతా తమ సినిమాలకు రారు, ఏ ఐదు మిలియన్స్ ఉన్న నటులకు థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారు, సో సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నంత మాత్రాన సినిమాలు చూడరు అంటూ సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో పూజ హెగ్డే సెటైర్ వేసింది.
అంతేకాకుండా పూజ హెగ్డే రెట్రో ప్రమోషన్స్ లో డాన్స్ చెయ్యడం హైలెట్ అయ్యింది. అలాగే టాలీవుడ్ కి గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు పూజ హెగ్డే.. రీసెంట్ గానే ఓ టాలీవుడ్ ఫిలిం కి సైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.