రాజ్ తరుణ్ నన్ను మోసం చేసాడు అంటూ రోడ్డెక్కి రచ్చ రచ్చ చేసిన ఆయన మాజీ ప్రేయసి లావణ్య.. రాజ్ తరుణ్ తనని వదిలించుకుని వేరే హీరోయిన్ తో ఉంటున్నాడు అంటూ ఆరోపించడమే కాదు, రాజ్ ఇంటిపై హక్కు తనకే ఉంది, తన డబ్బుతోనే రాజ్ తరుణ్ హీరోగా ఎదిగాడు అంటూ పలు టివి ఛానల్స్ లో కూర్చుని చెప్పిన లావణ్య.. ఆతర్వాత మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత రాజ్ తరుణ్ కి సారీ చెప్పి కేసులు వెనక్కి తీసుకుంది.
మస్తాన్ సాయి ఇంటికి పార్టీకి వెళ్ళినపుడు తాను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో తన ప్రవేట్ వీడియోస్ తన దగ్గర పెట్టుకుని మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేసాడు అంటూ అప్పట్లో రాజ్ తరుణ్ కి సారీ చెప్పి ఆయన పై ప్రేమను చూపించిన లావణ్య మళ్లీ ఇప్పుడు రాజ్ తరుణ్ ని వదలను అంటూ రచ్చ మొదలు పెట్టింది. కారణం తాను ఉంటున్న ఇంటి కోసం రాజ్ తరుణ్ పేరెంట్స్ రావడమే. రాజ్ తరుణ్ పేరు మీదున్న ఇంటిలోపలికి తమని రానివ్వడం లేదు, లావణ్య ఇల్లు పాడు చేస్తుంది. తన కొడుకు హీరోగా కష్టపడి కట్టుకున్న ఇంట్లో కి లావణ్య తమని రానివ్వడం లేదు అని రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
కానీ లావణ్య మాత్రం రాజ్ ఇల్లు అంటే తన ఇల్లు అది, రాజ్ తరుణ్ నన్ను రోడ్డున పడెయ్యడానికి సిద్ధమయ్యాడు, తన తల్లితండ్రులతో కలిసి నన్ను మోసం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ పేరెంట్స్ నన్ను నా తమ్ముడిని కొట్టారు, జుట్టుపట్టి లాగారు, వాళ్లే సీసీ టివి లను ధ్వంశం చేసారు, 15మందితో కలిసి నా మీద దాడి చేసారు అంటూ ఆరోపిస్తుంది.
రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం తాము నడవలేకుండా ఉన్నాము, తమ ఇంట్లోకి లావణ్య రానివ్వడం లేదు అంటూ ఆమె ఇంటి ముందే ధర్నా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.