సమంత, రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, తమన్నా వీరంతా ఒకొనొక సందర్భంలో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్టార్స్ హీరోలను చుట్టేసిన హీరోయిన్లు. సమంత సౌత్ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చేసి ముంబైలో సెటిల్ అయ్యే ఏర్పాట్లలో ఉంది. రకుల్ ప్రీత్ ని సౌత్ ఇండస్ట్రీ లైట్ తీసుకుంది. దానితో ఆమె బాలీవుడ్ లోనే అవకాశాలు వెతుక్కుంటుంది.
కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యి కెరీర్ లో వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతుంది. ఇక తమన్నా ఇప్పటికి తెలుగు నుంచి తమిళ్ వరకు అందులోను హిందీలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగానే కనబడుతుంది. ఈమధ్యన లవ్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచిన తమన్నా రేపు గురువారం ఏప్రిల్ 17 ఓదెల 2 తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
తమన్నా ఓదెల 2 టీజర్, ట్రైలర్ చూసాక అరుంధతిలో అనుష్క లెవల్లో తమన్నా ఆకట్టుకునేలా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తమన్నా అలాగే దర్శకుడు సంపత్ నంది అండ్ టీమ్ ఓదెల 2ని పాన్ ఇండియా మార్కెట్లో తెగ పబ్లిసిటీ చేసారు. ప్రస్తుతం సీనియర్ హీరో అవకాశాలు వచ్చినా వదులుకునేలా లేని తమన్నాకు ఓదెల 2 హిట్ అయ్యింది అంటే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో మరోసారి బిజీగా మారిపోతుంది.
మరి ఓదెల 2 రిజల్ట్ ను బట్టి తమన్నా కెరీర్ ఆధారాపడినా, ప్రస్తుతం ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ నార్త్ లో మొదలైంది. ఆ రకంగా తమన్నా మరికొన్నాళ్లు బిజీగానే ఉంటుంది అనుకోవచ్చు.