గత ఏడాది హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రేయసి లావణ్య వ్యవహారం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరూ చూసారు. లావణ్య రాజ్ తరుణ్ పై వెయ్యని నింద లేదు, అతను మరో హీరోయిన్ తో ఎఫ్ఫైర్ పెట్టుకున్నాడంటూ రచ్చ రచ్చ చేసింది. రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని ఉంది అంటూ అతని ఇంటి ముందు ధర్నాలు చెయ్యడం, రాజ్ తరుణ్ సినిమా ఈవెంట్స్ దగ్గర రచ్చ చెయ్యడం చూసాం.
ఆ తర్వాత లావణ్య కేసులో కీలకంగా కనిపించిన మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడమే కాదు అతను అమ్మాయిల ప్రవేట్ వీడియోలు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడంటూ లావణ్య మస్తాన్ సాయి పై కేసు పెట్టడమే తరువాయి లావణ్య రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుని. రాజ్ తరుణ్ ని క్షమాపణలు కోరుతూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.
అంతటితో రాజ్ తరుణ్ పై నింద తొలిగిపోయింది, అతనికే సమస్య లేదు అనుకున్నారు. రాజ్ తరుణ్ నటించిన సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే లావణ్య పై రాజ్ తరుణ్ పేరెంట్స్ దాడి, రాజ్ తరుణ్ పేరెంట్స్ పై లావణ్య దాడి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ పై లావణ్య, లావణ్య పై రాజ్ తరుణ్ పేరెంట్స్ పై దాడి చేయించినట్లుగా తెలుస్తుంది.
కోకాపేటలో నివాసముంటున్న లావణ్య ఇంటికి వెళ్లి రాజ్ తరుణ్ పేరెంట్స్ తమని ఇంట్లోకి రానివ్వమని అడగగా.. దానికి లావణ్య నిరాకరిస్తూ వారిని ఇంటి నుంచి బయటికి గెంటెయ్యడంతో ఆమె పై రాజ్ తరుణ్ పేరెంట్స్ కొందరితో దాడి చేయించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై కంప్లైంట్ అందుకున్న పోలీసులు లావణ్య పై దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.