సీతారామం చిత్రంతో సౌత్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హిందీ భామ మృణాల్ ఠాకూర్ ఆతర్వాత టాలీవుడ్ లో చేసిన సినిమాలలో హాయ్ నాన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చినా ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. ఆతర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ చిత్రంలోకి ఎంటర్ అయ్యింది.
హిందీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మృణాల్ ఠాకూర్ కి అక్కడ మాత్రం అదిరిపోయే ఆఫర్స్ రావడం లేదు. మరోపక్క మృణాల్ కి టాలీవుడ్ లో కూడా గ్యాప్ వచ్చింది అనే చెప్పాలి. తమిళనాట మృణాల్ ఠాకూర్ పేరు వినిపించినా అవేమి అధికారికం కాలేదు. ఇక ఈమధ్యన బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో టూ గ్లామర్ తో కనిపించింది.
తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం మృణాల్ షాకిచ్చే లుక్ లో దర్శనమిచ్చింది. చిట్టిపొట్టి గౌన్ లో మృణాల్ ఠాకూర్ క్యూట్ అండ్ స్వీట్ లుక్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. చుట్టూ ఫ్లోరల్ ఫ్లవర్స్ తో మృణాల్ ఠాకూర్ మ్యాగజైన్ లుక్ ఉంది. గ్లామర్ కు గ్లామర్, అందానికి అందం అన్ని మృణాల్ ఠాకూర్ ని హైలెట్ చేసాయి.