టాలీవుడ్ యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. కానీ లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గినట్లుగా కనిపించినా, విజయ్ దేవరకొండ సినిమాలొస్తున్నాయి అంటే యూత్ థియేటర్స్ కి బారులు కడుతున్నారు. అయితే లైగర్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో మొదలవుతుంది అనుకున్నారు. కానీ ఆ చిత్రం తేడా కొట్టడం విజయ్ దేవరకొండ బ్యాడ్ లక్ .
అయితే వరస చిత్రాలతో బ్యాక్ బౌన్స్ అవుతూ యూత్ లో ఫాలింగ్ తెచ్చుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్స్ వైరల్ అవడం కాదు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పించాయి. లైగర్ సినిమా సమయంలో విజయ్ దేవరకొండ గురించి బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం తనకు షాక్ ఇచ్చిందని అన్నాడు.
పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పెద్ద సూపర్ స్టార్ అన్నట్టుగా బాలీవుడ్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. కానీ టాలీవుడ్ కి వచ్చి చూస్తే విజయ్ దేవరకొండ ఇక్కడ పెద్ద స్టార్ కాదు, విజయ్ దేవరకొండ టైర్-2 హీరో మాత్రమేనని హిమేశ్ మన్కడ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి.