నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్యెల్యేగా బాద్యతలు సంక్రమంగా నిర్వర్తించడమే కాదు, అటు సినిమాల్లోనూ వరస విజయాలతో బాలయ్య తన మార్క్ చూపిస్తున్నారు. అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరస హిట్స్ తో కెరీర్లో సక్సెస్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో ఉన్నారు.
బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ 2 షూటింగ్ లో బాలయ్య శివతాండవం చెయ్యడానికి ఈ ఏడాదే ముహూర్తం పెట్టారు. అఖండ 2 తర్వాత బాలయ్య నెక్స్ట్ దర్శకుడు ఆల్మోస్ట్ దొరికేసారనే సంకేతాలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. అది కూడా బాలయ్య బర్త్ డే జూన్ 10 న భారీ అనౌన్సమెంట్ తో రాబోతుంది అని తెలుస్తోంది.
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ ముచ్చట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జాట్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని బాలయ్యతో చేయబోతున్నారట. ఈ మూవీ పై బాలయ్య బర్త్ డే కి అనౌన్సమెంట్ ఇస్తారట మేకర్స్. గోపీచంద్ డైరెక్ట్ చేసిన జాట్ చిత్రం నార్త్ లో సూపర్ హిట్ అవడమే కాదు, తెలుగులో రిలీజ్ కి సిద్దమవుతుంది.
ఆ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్య తో చెయ్యబోయే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవుతారని తెలుస్తోంది.