రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పెద్ది చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే రోజున పెద్ది టైటిల్ తో పాటుగా రామ్ చరణ్ లుక్ వదిలారు. పెద్ది లుక్ పై ఎలాంటి విమర్శలొచ్చినా శ్రీరామనవమి రోజున వదిలిన పెద్ది గ్లింప్స్ మాత్రం మెగా అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్స్ చేసింది.
పెద్ది గ్లింప్స్ లాస్ట్ షాట్ మాత్రం నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న కన్నడ సూపెర్ స్టార్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర తో కలిసి 45 మూవీ ఈవెంట్ లో కలిసి కనిపించారు. ఆ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ పెద్ది చిత్రపు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు, తాను రెండు రోజులు మాత్రమే పెద్ది చిత్రంలో నటించాను, పెద్ది టీమ్ తో కలిసి వర్క్ చేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉందని, వారి నటన నచ్చితే బుచ్చిబాబు ఇచ్చే ప్రశంసలు చాలా ఎనర్జీ ఇస్తాయని, రామ్ చరణ్ చాలా స్వీట్ పర్సన్.
రామ్ చరణ్ తో కలిసి పని చేయడం వల్ల అతని ప్రేమలో పడిపోయానని ఆ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ ఇచ్చిన ఎలివేషన్ పై మెగా ఫ్యాన్స్ లో పెద్దిపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు.