సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లారు. కొడుకు గౌతమ్ అక్కడే ఉండడంతో భార్య నమ్రత, కుమార్తె సితార లను తీసుకుని మహేష్ బాబు ఇటలీ వెళ్లారు. అక్కడ రోమ్ నగరంలో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసి ఈరోజు మంగళవారం ఉదయాన్నే హైదరాబాద్ తిరిగి వచ్చారు.
మహేష్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే అభిమానులు ఆయన తో ఫోటోస్ దిగేందుకు ఉత్సాహం చూపించగా.. మహేష్ చాలామందితో ఫొటోస్ దిగారు. ఇక మహేష్ వెకేషన్ నుంచి వచ్చారు కాబట్టి SSMB 29 షూటింగ్ కి వెళ్ళిపోతారు అనుకున్నారు అభిమానులు. కానీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ డాక్యుమెంటరీ పనులపై జపాన్ లో ఉన్నారు.
మరోపక్క ప్రియాంక చోప్రా కూడా అమెరికా వెళ్లారు. ఇక పృథ్వీ రాజ్ సుకుమారన్ తన హిందీ సినిమా పనుల్లో బిజీ అవుతున్నారు, మహేష్ విదేశాలనుంచి తిరిగొచ్చినా ఇప్పుడప్పుడే SSMB 29 నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కాదు అని తెలుస్తోంది, రాజమౌళి జపాన్ నుంచి తిరిగొచ్చాక కాస్త బ్రేక్ తీసుకుని SSMB 29 షూటింగ్ షురూ చేస్తారని వినికిడి.