దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి సినిమా నుంచి అంటే పటాస్ దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వరకు సక్సెస్ పరంపరను కొనసాగిస్తున్నారు. కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా రికార్డ్ సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. ఆయన ప్రమోషన్స్ పరంగా టాలీవుడ్ మేకర్స్ కి ఓ ఛాలెంజ్ విసిరాడు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి ప్లాన్ ప్రేక్షకులను థియేటర్స్ కి పరుగులు తీసేలా చేసింది. సంక్రాంతికి వస్తున్నాం ప్రీ ప్రమోషన్స్, పోస్ట్ ప్రమోషన్స్ తో నిజంగా అనిల్ రావిపూడి ఒక ట్రెండ్ సెట్ చేసాడు అనే చెప్పాలి. ఆ తర్వాత టాలీవుడ్ లో చాలామంది హీరోలు దర్శకులు అనిల్ రావిపూడి ని ఫాలో అవుతున్నారు.
ఏ సినిమా విడుదలవుతున్నా అనిల్ రావిపూడి ఇంకా వెంకటేష్, అలాగే హీరోయిన్స్ లా ప్రతి సినిమా హీరో, దర్శకుడు, హీరోయిన్స్ తో కలిసి ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయేలా సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాబిన్ హుడ్ తో నితిన్, వెంకీ కుడుముల అనిల్ రావిపూడిని ఫాలో అయితే.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఇంకా మిగతా సినిమాల హీరోలు అనిల్ ట్రెండ్ ని ఫాలో చెయ్యడం విశేషం.
ఈ లెక్కన అనిల్ రావిపూడి ట్రెండ్ కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని వదలదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది.