నిధి అగర్వాల్ టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలే చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో ఇప్పుడు హరి హర వీరమల్లు, రాజా సాబ్ మాత్రమే ఆమె చేస్తుంది. తాజాగా ఓ నెటిజెన్ నిధి అగర్వాల్ కెరీర్ పై వెటకారంగా కామెంట్ చెయ్యడం కాదు శ్రీలీల కెరీర్ తో పోలుస్తూ చేసిన కామెంట్స్ పై నిధి అగర్వాల్ కూల్ గా బదులిచ్చింది.
శ్రీలీల హీరోయిన్ గా ఎంటర్ అయిన కొద్దిరోజుల్లోనే 20 సినిమాలకు పైగా చేసింది, మరి మీరేమిటి అన్ని తక్కవ సినిమాలు చేసారు అన్న నెటిజెన్స్ కి నిధి అగర్వాల్.. మంచి స్క్రిప్ట్స్ అనుకున్న వాటికే సంతకం చేస్తున్నాను, అందుకోసం ఎంత సమయమైనా పట్టొచ్చు. కొన్ని కొన్నిసార్లు రాంగ్ స్టెప్ వేసి ఉండొచ్చు, నా నిర్ణయం తప్పై ఉండొచ్చు.
మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుని మంచి సినిమాల్లో భాగమవ్వాలనేది నా తపన. ఈ ఇండస్ట్రీలో నేను కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను, అంతేకాని శ్రీలీల లా తొందరపడి సినిమాలు చేయాలనుకోవడం లేదు(శ్రీలీల కథల ఎంపికలో రాంగ్ స్టెప్స్ వేసి బోలెడు సినిమాలు చేసింది అని ఇండైరెక్ట్ గా నిధి ప్రస్తావించింది) కాబట్టి బ్రదర్ నువ్వు నా గురించి ఎక్కువగా బాధపడిపోకు అంటూ ఆన్సర్ ఇచ్చింది నిధి అగర్వాల్.