సల్మాన్ ఖాన్ కి మరోసారి బాంబు బెదిరింపు రావడం ముంబై పోలీస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. అది కూడా సల్మాన్ కారును బాంబుతో పేల్చివేస్తామని దుండగులు బెదిరించడం ఇప్పుడు కలకలం సృషించింది. ముంబై పోలీసుల వాట్సాప్ నెంబర్ కు గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ కారును బాంబ్ తో పేల్చివేస్తామని మెసేజ్ చెయ్యడం సల్మాన్ ఖాన్ అభిమానులకు ఆందోళన కలిగించింది.
అంతే కాకుండా సల్మాన్ ఖాన్ ఇంటిలోకి దూరి సల్మాన్ ను చంపేస్తామని, బాంబు బ్లాస్ట్ చేస్తామని వారు బెదిరింపులకు పాల్పడ్డారు. దానితో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసారు. సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో బెదిరింపులకు పాల్పడుతుంది.
2024 లో సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో అంటే గెలాక్సీ అపార్ట్మెంట్స్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం, ఆతర్వాత సల్మాన్ కు సన్నిహితుడైన రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య తో సల్మాన్ తన చుట్టూ ఉన్న సెక్యూరిటీని పెంచడమే కాకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహాన్ని వాడుతూ రక్షణ కల్పించుకోవడమే కాదు ఇంటి ముందు కూడా పటిష్టమైన భదత్ర నడుమ ఆయన షూటింగ్స్ కి హాజరవుతున్నారు.