పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఆయన భార్య అన్న కొణిదెల కట్టుబడి ఉండడమనేది ఇప్పుడు అందరికి ఆశ్చర్యమే. కొడుకు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం బారిన పడి కోలుకుని తిరిగి హైదరాబాద్ కి చేరుకోవడంతో, పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా కొడుకు క్షేమం కోసం తిరుమల వెళ్లి అక్కడ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టి ఆమె శ్రీవారికి తల నీలాలు కూడా సమర్పించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈరోజు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో అన్నా పాల్గొనడమే కాదు శ్రీవారి దర్శనం అనంతరం అన్నాకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కొడుకు ప్రమాదం నుంచి కోలుకోవడంతో తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భారీ విరాళం అందజేశారు. తిరుమలలో ఒక పూట అన్నదానం కోసం పవన్ కళ్యాణ్ దంపతులు 17 లక్షల విరాళం అందజేశారు.