ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ పై ఆయన అభిమానుల్లో ఆందోళన కనబడుతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత దేవర చిత్రంలో ఫిట్ గా హ్యాండ్ సమ్ గా కనిపించిన ఎన్టీఆర్ వార్ 2 కోసము అదే స్టైలిష్ లుక్ ని మైంటైన్ చేసారు. కానీ ప్రశాంత్ నీల్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గడమే ఆయన లుక్ మొత్తం చేంజ్ అయ్యేలా చేసింది. దానితో ఎన్టీఆర్ లుక్ పై విమర్శలు మొదలయ్యాయి.
మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ సమయంలోనే ఎన్టీఆర్ లుక్ పై తెగ చర్చలు జరిగాయి. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్ లో ఎన్టీఆర్ మరింత సన్నగా కనిపించడంతో ఎన్టీఆర్ లుక్ పై మరోసారి డిస్కర్షన్ మొదలయ్యాయి. అది చూసి ఓ అభిమాని కొద్దిగా ఫీలవుతూ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొన్నామధ్య ప్రభాస్ ఫేస్ ని పాడుచేసారు, ఇప్పుడు ఎన్టీఆర్ ఫేస్ ని కూడా పాడు చేస్తున్నట్టున్నారు ట్రైనర్స్. హీరో లుక్ నే మార్చేస్తున్నారు! గతంలో ప్రభాస్ లుక్ ని ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ ని కంపేర్ చేస్తూ తాజాగా ఎన్టీఆర్ లుక్ విషయంలో డిజప్పాయింట్ అవుతూ వేసిన ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ లో హీరోల లుక్స్ పై వస్తున్న విమర్శలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో అనిపించడం లేదూ.!