Anupama Parameswaran About Her Moves
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117క్యూట్ అండ్ బ్యూటీ కర్లీ హెయిర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్. టిల్లు స్క్వేర్, డ్రాగన్ బ్యాక్ టు బ్యాంక్ విజయాలతో అనుపమ క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. అయితే గతంలో అనుపమ పరమేశ్వరన్ ఓ క్రిటెర్ తో లవ్ లో పడింది అనే ప్రచారం జరిగినా అది రూమర్ అని క్లారిటీ వచ్చేసింది.
తాజాగా మరోసారి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడింది. అది కూడా తమిళ కుర్ర హీరో అలాగే స్టార్ హర్ కొడుకు అయిన ధృవ్ విక్రమ్ తో అనుపమ ప్రేమలో ఉంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అదలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని కీలక విషయాలను షేర్ చేసింది.
నేను సినిమా కోసం కెమెరా ముందు నుంచుని పది పేజీల డైలాగ్స్ ను అలవోకగా చెప్పేస్తాను, ఎలాంటి భయము అనిపించదు, కానీ ఫోటో షూట్స్ చేయించుకునేటప్పుడు, అలాగే ఇంటర్వూస్ కోసం కెమెరా ముందుకు వస్తే మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటాను అని చెప్పిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తాను ఎంచుకునే కథల విషయంలో తన ధోరణి మారింది అని.. టిల్లు స్క్వేర్, డ్రాగన్ చిత్రాల్లో నా కేరెక్టర్ ని ఆడియన్స్ ఇష్టపడ్డారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉన్నాను అని అనుపమ చెప్పుకొచ్చింది.