కొన్నేళ్లుగా నిగురు కప్పిన నిప్పులా మారిన మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు గత ఏడాది నుంచి రోడ్డున పడ్డాయి. మంచు విష్ణు vs మనోజ్ లు తగాదా పడుతున్నారు. అంతేకాదు వారి రచ్చ రోడ్డెక్కడంతో మంచు వారి పరువు రోడ్డున పడింది. మోహన్ బాబు కూడా మంచు విష్ణు సైడ్ తీసుకోవడంతో ఆ గొడవ ముదిరి పాకాన పడింది.
మొదటి నుంచి మనోజ్ ని వెనకేసుకొస్తూ ఆఖరికి పెళ్లిని కూడా తన ఇంట్లోనే చేసింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ని విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఫ్రేమ్ లోకి రానివ్వకుండా ముంబై పంపేశారు అనే టాక్ ఉంది. మంచు మనోజ్ కొన్నాళ్ళు లక్ష్మి ఇంట్లోనే ఉండి తర్వాత భార్య మౌనికను తీసుకుని వేరుగా వెళ్ళిపోయాడు. గత ఏడాది మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు గొడవ పడిన సందర్భంలో లక్ష్మి ముంబై నుంచి వచ్చి వెంటనే వెళ్ళిపోయింది అనే ప్రచారం జరిగింది.
మళ్లీ గత వారం రోజులుగా మంచు మనోజ్ విష్ణు పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్న క్రమంలో మంచు లక్ష్మి.. మనోజ్ ని టీచ్ ఫర్ ఛేంజ్ ఈవెంట్ లో చూడగానే కన్నీళ్లు పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మంచు లక్ష్మి స్టేజ్ పై ఉండగా.. మంచు మనోజ్ అతని భార్య మౌనిక సర్‌ప్రైజ్ చేశారు. దానితో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనోజ్ ని హత్తుకుని ఏడ్చేసింది. పక్కనే ఉన్న మనోజ్ భర్య లక్ష్మిని ఓదార్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట సంచలనంగా మారింది.