గత కొంత కాలంగా ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ జంట కాపురం విడాకుల దిశగా సాగుతోందని, కలతలు తీవ్రతరమయ్యాయని బాలీవుడ్ మీడియా ప్రచారం సాగించింది. ఆ ఇద్దరూ విడివిడిగా ఫంక్షన్లకు సపరేట్‌గా రావడంతో అందరిలో అనుమానాలు పెరిగాయి. కానీ కొద్దిరోజులకే అభి-ఐష్ జంట తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తూ కలిసి కెమెరాలకు ఫోజులిచ్చారు.
ఇటీవల ఈ దంపతుల సాన్నిహిత్యం చూస్తుంటే, వారి మధ్య ఎలాంటి కలతలు లేవని అంతా భావిస్తున్నారు. కానీ ఇంతలోనే ఇప్పుడు ఐశ్వర్యారాయ్- అభిషేక్ జంట మధ్య డబ్బు ప్రధాన సమస్యగా మారుతుందని జ్యోతిష్కులు జోశ్యం చెబుతున్నారు. వారి గ్రహస్థితి ఆధారంగా, జ్యోతిష్యులు మాట్లాడుతూ.. ఆ కుటుంబంలో సమస్య భావోద్వేగానికి సంబంధించినదో లేదా బంధానికి సంబంధించినదో కాదు.. ఆర్థిక పరమైన గొడవలు వస్తాయి. అవి కుటుంబంతో కలిసి ఉంటే ఇంకా పెద్దవి అవుతాయని జోశ్యులు చెప్పారు.
దీని కారణంగా ఐశ్వర్యారాయ్- అభిషేక్ దంపతులు విడిగా, ఇతరులకు దూరంగా బతకాలని కూడా సదరు జ్యోతిష్కులు సూచించారు. ఇంట్లో వాళ్ల నుంచి ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వెలువరించారు. సెప్టెంబర్ 2025 వరకు వారి వివాహంలో అల్లకల్లోలాలను ఎదుర్కోవచ్చని జ్యోతిష్కురాలు వెల్లడించారు. రాబోయే కొన్ని నెలలు ఈ జంటకు కష్టకాలంగా ఉండవచ్చని రాశి ఫలాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు సంబంధంలో సమస్యలు ఉంటాయి. అయితే ఐశ్వర్య - అభిషేక్ ఇద్దరూ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారు దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.. సెప్టెంబర్ గడిచిపోతే ఆ తర్వాత వారి పెళ్లి బంధానికి ఎలాంటి సమస్యా లేదు.. అని తెలిపారు.
సమస్య డబ్బు గురించి, భావోద్వేగాల గురించి కాదు... అని మరోసారి జ్యోతిష్కులు ధృవీకరించారు. ఆర్థిక ఒత్తిడితో పాటు, ఇంట్లో ఉద్రిక్తతలు , బయటి వైపు నుంచి వచ్చే ప్రోద్భలాలు ఈ జంటకు సమస్యగా మారుతాయని కొత్త సంవత్సర ఫలాల్ని జ్యోతిష్కులు వివరించారు. వారి ప్రస్తుత నివాసం నుండి బయటకు వెళ్లడం వల్ల ఈ జంట ప్రయోజనం పొందవచ్చని జ్యోతిష్కురాలు సూచించారు. వారు కుటుంబం నుండి విడిగా జీవించాలి, అప్పుడే శాంతి తిరిగి వస్తుందని అన్నారు. తన విశ్లేషణ ప్రకారం, ఐశ్వర్య దానిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండవచ్చని కూడా వెల్లడించింది. ఐశ్వర్య దానిని తట్టుకోలేకపోతోంది! అని....ఆమె నిరంతర ఇతరుల జోక్యం, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్కులు తెలిపారు. అయితే జ్యోతిష్య అనేది అంచనా మాత్రమే. ఇలాగే జరుగుతుందని వందశాతం ఎవరూ ధృవీకరించరు. అయినా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ల జాబితా చాలా పెద్దది.