కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ ని చూసి ఆయన అభిమానుల కోలాహలం మాములుగా లేదు. విజయశాంతి స్టేజ్ పై కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే అభిమానులు గోల గోల చేసారు. కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ లను చూస్తుంటే రామ-లక్షణులులా ఉన్నారంటూ విజయశాంతి పొగిడేశారు.
ఆతర్వాత కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కి ఇప్పటికీ మూడు ఈవెంట్స్ జరిగాయి, అభిమానులు ఆదరించారు, నేను ఈ ఈవెంట్ లో మాట్లాడను, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో మాట్లాడతాను అని కాన్ఫిడెన్స్ చూపించగా.. ఎన్టీఆర్ మైక్ తీసుకుని ఎప్పుడు అన్నయ్యతో స్టేజ్ పై ఉన్నా తనకు తండ్రి హరికృష్ణ గారు లేని లోటు తెలిసేది, కానీ విజయశాంతి గారు ఆ లోటు తీర్చారు అంటూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గురించి మట్లాడారు.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని తాను వీక్షించానని, సినిమా అద్భుతంగా వచ్చింది, చివరి 20 నిముషాలు కన్నీళ్లు పెట్టిస్తుంది, విజయశాంతి గారు, కళ్యాణ్ అన్న అద్భుతంగా నటించారు.. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలవబోతుంది, ఎప్పుడు చెబుతూ ఉంటాను కాలర్ ఎగరేసి చెబుతున్నా అని కానీ ఈసారి అన్నయ్య కాలర్ ఎగరేస్తారు ఎగరేయ్యండి అన్నా అంటూ నేనే అన్న కాలర్ ఎగరేస్తాను అన్ని కళ్యాణ్ రామ్ కాలర్ సరిచేశారు ఎన్టీఆర్.
మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ని అభిమానులంతా హిట్ చెయ్యాలని చెప్పిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కన్నా ముందు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చూడాలి, దాని కన్నాముందు ఆగష్టు 14 న వార్ 2 వస్తుంది అంటూ తన సినిమాల అప్ డేట్స్ ని సింపుల్ గా తేల్చేసారు ఎన్టీఆర్.