Advertisement
Google Ads BL

బాక్సాఫీస్‌పై తండ్రి కూతుళ్ల హ‌వా


కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో న‌టిగా ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త‌ర్వాత సుహానా మ‌రో చిత్రానికి సంత‌కం చేయ‌లేదు. కేవ‌లం త‌న తండ్రితో క‌లిసి న‌టించాల‌ని వేచి చూస్తోంది. సుహ‌నా త‌న తండ్రి షారూఖ్ తో క‌లిసి కింగ్ సినిమాలో న‌టించ‌నుంది.

Advertisement
CJ Advs

ఇది భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఒక న్యూస్ పోర్టల్ తాజా క‌థ‌నం ప్రకారం.. మే నెలలో షూటింగ్ ప్రారంభిస్తారని నిర్మాతలు తెలిపారు. పింక్‌విల్లా ప్రకారం.. ముంబైలోని ఒక స్టూడియోలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ త‌ర్వాత యుఎఇ, యూరప్‌లో అంతర్జాతీయ షెడ్యూల్‌లను పూర్తి చేస్తారు. షారుఖ్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తాడు. అత‌డు డాన్ గా కిల్ల‌ర్ గా క‌నిపిస్తాడు. సుహానాను కాపాడే కింగ్ పిన్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా క‌థాంశం ఏమిట‌న్న‌దానిపై ఇంకా పూర్తి స్ప‌ష్ఠ‌త లేదు. ఈ చిత్రంలో సుహానా స్టంట్స్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. అయితే షారూఖ్ న‌ట‌వార‌సురాలిగా సుహానా ఎలాంటి మార్క్ వేస్తుందో చూడాలని ఖాన్ అభిమానులు ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.

Father-daughter rivalry at the box office:

Shah Rukh Khan and his daughter Suhana Khan new project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs