Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి రుణపడి పోతానంటున్న హృతిక్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 తో అడుగుపెడుతున్నారు. గ్రాండ్ డెబ్యూ గా ఎన్టీఆర్ హిందీ ఎంట్రీ ఉంటుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ  సంబరపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 షూటింగ్ ఫినిష్ చేసారు. 

Advertisement
CJ Advs

తాజాగా హృతిక్ రోషన్ వార్ 2 పై అలాగే ఎన్టీఆర్ పై చేసిన క్రేజీ కామెంట్స్ వైరల్ అయ్యాయి. వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే కి థియేటర్స్ ను దద్దరిల్లించేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా హృతిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వార్ చాలా ఈజీగా పూర్తయ్యింది, వార్ 2 కి సంబంధించి ప్రతి షెడ్యూల్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసారు, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా వల్లే ఇదంతా సాధ్యమైంది. 

ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడం పట్ల చాలా హ్యాపీ గా ఉన్నాను, ఎన్టీఆర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను, ఎన్టీఆర్ సెట్ లో చాలా ఎనర్జిగా, సరదాగా కనిపిస్తారు, ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటాను, ఇక అయాన్ ముఖర్జీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడు, వార్ 1 కన్నా భారీగా వార్ 2 ఉండబోతుంది. ఇక చాలు నా సినిమా గురించి నేనే ఎక్కువగా చెప్పుకుంటే బాగోదు అంటూ హృతిక్ వార్ 2పై అంచనాలు పెంచేశారు 

Hrithik Roshan says he is indebted to NTR:

Working with NTR has taught me many things - Hrithik
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs