Advertisement
Google Ads BL

జాన్వీకి పారిశ్రామిక వేత్త క‌ళ్లు చెదిరే కానుక‌


జాన్వీ క‌పూర్.. ఈ పేరు బాలీవుడ్, టాలీవుడ్ లో మార్మోగుతోంది. హిందీ చిత్ర‌సీమ‌లో త‌న‌ను తాను నిరూపించుకున్న  జాన్వీ ఇటీవ‌ల వ‌రుస‌గా తెలుగు చిత్రాల్లో న‌టిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న `దేవ‌ర‌`లో న‌టించి పాన్ ఇండియా హిట్ అందుకున్న జాన్వీ, ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పెద్ది లాంటి భారీ చిత్రంలో న‌టిస్తోంది. బుచ్చిబాబు స‌న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక జాన్వీ క‌పూర్ నిరంత‌ర స్నేహాలు, ముంబైలో పార్టీ క‌ల్చ‌ర్ గురించి తెలిసిందే. జాన్వీ కాస్ట్ లీ స్నేహాల గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతుంది. ఈ బ్యూటీకి పారిశ్రామిక వేత్త ఆదిత్య బిర్లా కుమార్తె అన‌న్య బిర్లా క్లోజ్ ఫ్రెండ్. అన‌న్య మ్యూజిక్ రంగంలో గాయ‌నిగా రాణిస్తోంది. ప‌రిశ్ర‌మ నుంచి జాన్వీ మ‌ద్ధ‌తు త‌న‌కు ఉంది. ఇక ఇదే నేప‌థ్యంలో జాన్వీ క‌పూర్ కి అన‌న్య అదిరిపోయే కానుక‌ను ఇచ్చింది. ఈ కానుక‌ను చూసి అభిమానులు ఔరా! అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు.

జాన్వీ క‌పూర్ ఇప్పుడు 4.99కోట్ల ఖ‌రీదైన లంబోర్ఘిణి కార్ కి గ‌ర్వ‌కార‌ణ‌మైన య‌జ‌మానిగా మారింది అంటే అది అన‌న్య బిర్లా కార‌ణంగానే. ``ప్రేమ‌తో నీకు కానుక అందిస్తున్నా``న‌ని అన‌న్య బిర్లా ఒక గిఫ్ట్ బాక్స్ ని కూడా కార్ తో పాటు పంపారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. స్నేహితుల మ‌ధ్య ఇలాంటి కానుక‌ల ఎక్స్ ఛేంజ్ చాలా కాలంగా ఉంది. అయితే ఇప్పుడు ఖ‌రీదైన కార్ కానుక‌గా అందుకోవ‌డంతో దీనికి ప్ర‌చారం ల‌భించింది. జాన్వీ ఒక్కో సినిమాకి 3-4 కోట్ల మ‌ధ్య అందుకుంటోంది. అంత‌కుమించిన ఖ‌రీదైన కానుక‌ను అందుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

అనన్యశ్రీ బిర్లా భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. గాయని-గేయ రచయిత్రి. అన‌న్య బిర్లా లివిన్ ది లైఫ్, మీన్ టు బి అనే సింగిల్స్ లో న‌టించింది. ప‌లు బాలీవుడ్ చిత్రాల‌కు అన‌న్య పాట‌లు పాడింది. అలాగే అన‌న్య బిర్లా రూపొందించిన అన్ స్టాప‌బుల్ ఆల్బ‌మ్ లో పూజా హెగ్డే, సానియా మీర్జా క‌నిపించారు.

బిర్లా గ్రామీణ భారతదేశంలోని మహిళలకు మైక్రోఫైనాన్స్ అందించే స్వతంత్ర మైక్రోఫిన్ సంస్థ వ్యవస్థాపకురాలు. ఆమె ఇకై అసాయి వ్యవస్థాపకురాలు.. ఎంపవర్ సహ వ్యవస్థాపకురాలు కూడా.బిర్లా తన పని, వ్యవస్థాపకతకు అవార్డులను అందుకుంది. 2018లో జీక్యూ అత్యంత ప్రభావవంతమైన భారతీయ మహిళ‌ల‌లో ఒకరిగా జాబితాలో నిలిచారు.

Janhvi gets an eye-popping gift from a Businessman:

Janhvi Kapoor gets special gift from Ananya Birla
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs